సెంచరీల మోత మోగిస్తున్న కోహ్లీకి ఆ సబ్జెక్టులో మాత్రం 100 కి మూడేనట!

Sunday, September 8th, 2019, 11:21:30 AM IST

విరాట్ కోహ్లీ ఈ పేరు కి పరిచయం అవసరం లేదు. టీమిండియా కెప్టెన్ గా, ఈ తరం క్రికెట్ లో అత్యుత్తమ ఆటగాడిగా, దిగ్గజ క్రికెటర్లు సైతం అందుకోలేని రికార్డులని కోహ్లీ అలవోకగా అందుకుంటున్నారు. అయితే ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ పలు ఆసక్తి కర విషయాలను వెల్లడించారు. మ్యాథ్స్ కొరకు స్కూల్ డేస్ లో చాల కష్ట పడేవాణ్ణి అని చెప్పుకొచ్చారు. క్రికెట్ సాధన కోసం కూడా అంతగా కష్ట పడలేదని వ్యాఖ్యానించారు. జీవితం లో ఉపయోగపడని మ్యాథ్స్ ఫార్ములాస్ గురించి తెలిపారు.

విరాట్ కోహ్లీ సెంచరీలతో సచిన్ రికార్డులని బద్దలు కొట్టగలదని అందరితో అనిపించుకున్న మాట. సగటు క్రికెట్ ప్రేక్షకుడు సైతం అది చెప్పగలడు. అయితే తాను మాత్రం క్రికెట్ కంటే చిన్నపుడు స్కూల్ డేస్ లో మ్యాథ్స్ పాస్ అవ్వడానికి చాల కష్టపడాల్సి వచ్చిందని తెలిపారు. మ్యాథ్స్ లో స్కూల్ డేస్ లో 100 కి మూడు మార్కులే వచ్చేవి అని తెలిపాడు. 68 సెంచరీలతో సచిన్ రికార్డు ని సైతం చెరిపెయ్యడానికి వస్తున్న విరాట్ మ్యాథ్స్ లో వీక్ అంటే అతిశయోక్తే. ఏదేమైనా విరాట్ కోహ్లీ దేశానికే తలమానికం లా తన డైన శైలిలో ప్రత్యర్థుల పై విరుచుకుపడి టీమిండియా ని సమర్థవంతంగా ముందుకి నడిపిస్తున్నాడు.