సూపర్ ఓవర్‌లో ఆ ముగ్గురికి బౌలింగ్ చేయడం కష్టమే – కుల్దీప్ యాదవ్

Sunday, April 26th, 2020, 01:30:03 AM IST

భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ క్రికెట్‌లో తనకు ఎదురైన కొన్ని అనుభవాలను అభిమానులకు తెలియచేశారు. క్రికెట్ సూపర్ ఓవర్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లకు బౌలింగ్ చేయకూడదని, అది తనకు చాలా కష్టమైన పని అని అన్నాడు.

అయితే భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ తన బౌలింగ్‌లో బాగా ఆడతారని చెప్పుకొచ్చాడు. అయితే రోహిత్, అయ్యర్‌ల కన్నా సూర్య కుమార్ తన బౌలింగ్‌లో బాగా ఆడతాడని అన్నాడు. కాగా ఇక ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తన బౌలింగ్ మరింత మెరుగుపడడానికి కారణం మహేంద్ర సింగ్ ధోనీ అని చెప్పుకొచ్చాడు.