బిగ్ న్యూస్: 400 అధిగమించే సత్తా టీంఇండియాలో వారికీ మాత్రమే వుంది–లారా

Thursday, January 2nd, 2020, 11:46:22 PM IST

టెస్టు మ్యాచుల్లో వేగవంతంగా పరుగులు తీయాలంటే అది అంత తేలికైన విషయం కాదు. టెస్టు మ్యాచుల్లో ఇప్పటివరకు బ్రియాన్ లారా అత్యధిక వ్యక్తి గత స్కోర్ తో ముందు వరుసలో వున్నారు. అయితే టీమిండియా ఆటగాళ్ల తీరు ఫై లారా ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా టీం ఇండియా సారధి విరాట్ కోహ్లీ ఫై ప్రశంసలు కురిపించారు. ఐసీసీ నిర్వహించే అన్ని టోర్నీలలో టీం ఇండియా విజయం సాదించగలదని అన్నారు. అంతేకాకుండా కోహ్లీ నేతృత్వం లో టీం ఇండియా టెస్ట్, వన్డే లలో అత్యున్నత శిఖరాలని అధిరోహించిందని విరాట్ కోహ్లీ ఫై ప్రశంసలు కురిపించారు.

అయితే 400 స్కోర్ ని అధిగమించే సత్తా ప్రస్తుత ఆటగాళ్లలో ముగ్గురికి మాత్రమే ఉందని లారా అన్నారు. అందులో ఒకరు ఆస్ట్రేలియన్ బ్యాట్సమెన్ డేవిడ్ వార్నర్ అయితే మరొక ఇద్దరు టీం ఇండియా బ్యాట్సమెన్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ అని అన్నారు. విరాట్ అటాకింగ్ బావుంటుందని అన్నారు. రోహిత్ తనదైన రోజున ఈ మార్కుని చేరుకోగలడని తెలిపారు. అయితే ఇప్పటివరకు బ్రియాన్ లారా అత్యధిక వ్యక్తిగత స్కోర్ 400 ఇప్పటివరకు ఏ ఒక్కరు అధిగమించలేదు.