IPL అప్డేట్ : ఇక ఈఏడాది ఐపీఎల్ ఆటలు లేనట్లేనా…?

Monday, March 30th, 2020, 09:27:49 AM IST

మన ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆటకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎలాంటిదో మనం ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు. క్రికెట్ ఆటకున్న అభిమానులు మరేఇతర ఆటకు లేరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా అవసరం లేదు. ఇకపోతే మన దేశంలో ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ ఆటలు భయంకరమైన కరోనా వైరస్ వలన కొద్దీ రోజులు వాయిదా పడ్డ సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కొద్దిగా నిరాశలో కూరుకుపోయారు. ఇకపోతే తాజా సమాచారం ప్రకారం కొద్దీ రోజులు వాయిదా పడ్డ ఈ ఐపీఎల్ ఆటలను ఈ ఏడాది పూర్తిగా రద్దు చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్టు సమాచారం.

అయితే ఈ ఐపీఎల్ రద్దుకు సంబందించిన అధికారిక ప్రకటనను త్వరలోనే విడుదల చేయాలనీ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే దేశంలో భయంకరమైన కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ టోర్నీని పూర్తిగా రద్దు చేయడం మినహా మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదని బీసీసీఐ వర్గాలు నిర్ణయం తీసుకుందని సమాచారం. అయితే ఈ విషయములో కేంద్రం ప్రభుత్వాన్ని సంప్రదించిన తరువాత ఐపీఎల్‌ను రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ అధికారికంగా ప్రకటిస్తుందని సమాచారం.