కరోనా కారణంగా ఆగిపోయిన ఐపీఎల్ – చెన్నై వీడిన ఎంఎస్ ధోని…

Sunday, March 15th, 2020, 01:39:02 PM IST

భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న కారణంగా ఈ నెలలో జరగాల్సిన ఐపీఎల్ క్రికెట్ పోటీలు కాస్త వాయిదా పడ్డాయి. ఈ మేరకు చెన్నై చేరుకున్నటువంటి ఆటగాళ్లు వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్లిపోతున్నారు. కాగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా, గత రెండు వారాల నుంచి చెన్నైలో ఉండి, కరమైన సాధన చేస్తున్న మిస్టర్ కూల్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, తన స్వస్థలమైన రాంచీకి బయలుదేరి వెళ్లారు. నిజానికి ఐపీఎల్ పోటీలు ఈ నెల 29 నుండి ప్రారంభం కావాల్సింది. కానీ వాటిని ఏప్రిల్ 15 నుండి మళ్ళీ ప్రారంభించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

ఈ తరుణంలో చెన్నై ఫ్రాంచైజీ జట్టు యాజమాన్యం, కొద్దీ రోజులు ఈ ప్రాక్టీస్ సెషన్ ని కూడా నిలిపివేసింది. ఈ మేరకు జట్టు సారధి ధోని తో సహా, సురేష్ రైనా, అంబటి రాయుడు వాళ్ళ వాళ్ళ స్వస్థలానికి బయలుదేరిపోయారు. ఈమేరకు వారికి ఒక వీడ్కోలు కార్యక్రమం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చెపాక్ స్టేడియంలో ధోని అభిమానులందరికి ఆటోగ్రాఫ్ లు సెల్ఫీలు ఇస్తూ సరదాగా గడిపాడు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతానికి సామాజిక మాంద్యమాల్లో వైరల్ గా మారింది.