ఫిక్సింగ్ ని అరికట్టేందుకు ద్రావిడ్ కొత్త మార్గం

Wednesday, August 7th, 2013, 07:20:05 PM IST

టీం ఇండియా గర్వించదగ్గ ప్లేయర్స్ లో ఒకరైన మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ మిస్టర్ డిపెండబుల్ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా రాహుల్ ద్రావిడ్ మ్యాచ్ ఫిక్సింగ్ ని నివారించడానికి కొన్ని నివారణ మార్గాలను సూచించాడు. ద్రావిడ్ చెబుతూ ‘ మ్యాచ్ స్పాట్ ఫిక్సింగ్ అనేది క్రిమినల్ నేరం దీన్ని కఠినమైన శిక్షలతోనే అరికట్టగలం. అందుకే దీన్ని అరికట్టడానికి రెండంచెల వ్యూహాన్ని సూచిస్తున్నాను. ఇందులో ముందుగా ఇక ముందు రానున్న వర్ధమాన క్రికెటర్లకు ఈ విషయాలపై ముందుగానే అవగాహన కలిగించాలి. దీంతో పాటు చట్టాని ఎంతో కఠినంగా రూపొందించాలి. అప్పుడే మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ లాంటి వాటిని అరికట్టగలమని, ఆ పని ఎంత తొందరగా చేస్తే అంత మంచిదని క్రికెట్ బోర్డుకి’ ద్రావిడ్ సూచించాడు.

అలాగే మాట్లాడుతూ ‘ఐపిఎల్ 6 లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిందితులైన శ్రీశాంత్, అజిత్, అంకిత్ చవాన్ ల గురించి నేనేమి మాట్లాడను, వాళ్లీ తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని’ అన్నాడు.