వింబుల్డన్ టైటిల్ సొంతం చేసుకున్న బర్తోలి

Sunday, July 7th, 2013, 06:30:10 PM IST

ఆరేళ్ల కిందట వింబుల్డన్ టైటిల్ కోసం పోరాడి ఫైనల్ లో ఓడింది. ఆరేళ్లైనా ఆ కసి తీరలేదు. చివరిగా ఈ సారి ఆ టైటిల్ సొంతం చేసుకుంది. ఆ ప్లేయరే మారియన్ బర్తోలి. వింబుల్డన్ టోర్నీ మహిళల సింగిల్స్ లో జర్మనీకి చెందిన సబైన్ లిసికి పై ఘన విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది బర్తోలి.

ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ఫైనల్ వరకు దూసుకెళ్లిన ఫ్రెంచ్ క్రీడాకారణి మరియన్ బర్తోలీ వింబుల్డన్ టైటిల్ సొంతం చేసుకుంది. ఫైనల్ లో జర్మనీకి చెందిన సబైన్ లిసికిపై 6-1, 6-4 తేడాతో బర్తోలి విజయం సాధించింది. ఫ్రాన్స్ కు చెందిన బర్తోలికి కెరీర్ లో ఇదే తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్. ఆరేళ్ల కిందట వింబుల్డన్ టైటిల్ కోసం పోటీపడి ఫైనల్ లో సెరినా విలియమ్స్ చేతిలో ఓడిపోయింది బర్తోలి.

గతేడాది వింబుల్డన్ విజేత సెరినా వెలియమ్స్, రన్నరప్ అగ్నెస్నా రద్వాన్ స్కాను దాటుకుని దూసుకుపోయిన సబైన్ లిసికి బర్తోలి దాటికి నిలువలేకపోయింది. వింబుల్డన్ లో ఈ ఇద్దరు తలపడటం ఇది మూడోసారి. ప్రస్తుతం 15 వ ర్యాంకింగ్ లో కొనసాగుతున్న బర్తోలి వింబుల్డన్ విజయంతో ఏడో ర్యాంకు కు చేరుకునే అవకాశముంది. 2004 వింబుల్డన్ లో క్వార్టర్ పైనల్స్ లో వెనుదిరిగిన బర్తోలి, 2007లో ఫైనల్స్ కు చేరుకుంది. ఇప్పుడు వింబుల్డన్ గెలిచి ఆ లక్ష్యం నెరవేర్చుకుంది