ఫుట్‌బాల్‌ కు గుడ్ బై చెప్పిన ‘మెస్సి’

Monday, June 27th, 2016, 04:13:49 PM IST


ప్రపంచంలో ఫుట్‌బాల్‌ ఆట ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా తెలిసే పేరు ‘మెస్సీ’. అర్జెంటీనా జట్టు ఆటగాడు మెస్సి ప్రపంచ ఫుట్‌బాల్‌ కు ఇతడి సేవలు చిరస్మరణీమైనవి. టీమ్ లో మెస్సీ ఉంటే దాదాపు మ్యాచ్ గెలిచేసినట్టే అనే నమ్మకం ఉండేది అభిమానుల్లో. అలాంటి గొప్ప ఆటగాడు ఇబ్బందికర పరిస్థితుల్లో రిటైర్మెంట్ ప్రకరించాడు. ఆదివారం కోపా ఫుట్‌బాల్‌ టోర్నీలో భాగంగా చిలీతో జరిగిన మ్యాచ్ లో పెనాల్టీ షూట్ అవ్ట్ లో అర్జెంటీనా చిలీ చేతిలో 4 – 2 తేడాతో ఓడిపోయింది.

ఆ వెనువెంటనే మెస్సీ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ‘ఇక అంతర్జాతీయ కెరీర్ ను ముగించాల్సిన సమయం వచ్చిందని, ఇదే చాలామంది కోరుకుంటున్నారని, జట్టును గెలిపించలేకపోయానని’ మెస్సీ అన్నాడు. టైటిల్ ఫెవరెట్ గా బరిలోకి దిగిన అర్జెంటీనా ఓటమి పాలవ్వడం, మెస్సీ జట్టు నుండి వైదొలగడం సాకర్ అభిమానుల్ని తీవ్ర కలవరానికి గురిచేసింది.