ఇదీ మ్యాచ్ అంటే..మ్యాజిక్ చేసిన షమీ,రోహిత్ దెబ్బతో సిరీస్ కైవసం..!

Wednesday, January 29th, 2020, 04:40:11 PM IST

చాలా కాలం తర్వాత మన దేశ క్రికెట్ అభిమానులు మరియు ఓవరాల్ క్రికెట్ అభిమానులకు గుర్తుండిపోయే ఒక అదిరిపోయే మ్యాచ్ కు వేదికగా సెడాన్ పార్క్ స్టేడియం వేదికగా మారింది.ప్రస్తుతం భారత్ మరియు న్యూజిలాండ్ జట్ల నడుమ టీ20 సిరీస్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే.వరుసగా రెండు విజయాలు భారత్ సొంతం చేసుకోవడంతో ఈరోజు మూడో మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది.

దానైకి తోడు ఈ మ్యాచ్ కూడా అంతే స్థాయిలో రసవత్తరంగా నరాలు తెగే ఉత్కంఠ రీతిలో కొనసాగింది.మొదటగా టాస్ నెగ్గి ఫీల్డింగ్ తీసుకున్న కివీస్ కు నిర్ణీత ఓవర్లలో మన వాళ్ళు 179 పరుగుల లక్ష్యాన్ని ఇవ్వగా చివరి ఓవర్ మొదటి బాల్ వరకు మ్యాచ్ భారత్ చేతుల్లోనుంచి జారిపోయింది అని అనుకున్నారు కానీ అక్కడ నుంచి షమీ చేసిన మ్యాజిక్ కు మ్యాచ్ కాస్తా టై అయ్యింది.దీనితో చాలా కాలం తర్వాత ఇరు జట్లు సూపర్ ఓవర్ ను ఎన్నుకోగా మొదటగా బ్యాటింగ్ చేసిన కివీస్ 6 బాల్స్ లో 17 పరుగులు బాదేశారు.దీనితో మనకు 18 రన్స్ కావాలి.

మొదట బ్యాటింగ్ కు దిగిన ఇద్దరు స్ట్రైకర్స్ రోహిత్ మరియు రాహుల్ లనే కోహ్లీ పంపాడు.మొదటి బాల్ రోహిత్ రెండో పరుగు దగ్గర తృటిలో రన్ అవుట్ మిస్ అయ్యాడు.తర్వాత సింగిల్ తీసి రాహుల్ కు ఇవ్వగా రాహుల్ వెంటనే ఒక 4 ఒక సింగిల్ తీసి మళ్ళీ రోహిత్ కు స్ట్రైక్ ఇచ్చాడు.అప్పుడు స్టార్ట్ చేసాడు రోహిత్ వరుసగా రెండు బాల్స్ కు రెండు భారీ సిక్సర్ లు బాదేసి టీం ఇండియాకు సిరీస్ ను అందించాడు.మొత్తానికి మాత్రం ఈ మ్యాచ్ ప్రతీ బాల్ క్లైమాక్స్ గా నడిచింది అని చెప్పాలి.