వన్‌డే మ్యాచుల్లో ఫాస్ట్ బౌలర్ మిచ్చెల్ స్టార్క్ రికార్ద్..!

Friday, June 7th, 2019, 06:19:46 PM IST

ప్రస్తుతం దేశంలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా చెలామని అవుతున్న వారిలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచ్చెల్ స్టార్క్ ఒకరు. అయితే నిన్న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తన పేరిట ఒక అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు ఆ ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్. ప్రస్తుతం జరుగుతున్న వరల్ద్ కప్‌లో భాగంగా నిన్న ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు పోటీ పడ్దాయి. అయితే తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 49 ఓవర్లకు గాను 288 పరుగులు చేసి ఆలౌటైంది.

అయితే ఆ తరువాత బ్యాటింగ్‌కి వచ్చిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులు మాత్రమే చేసి 9 వికెట్లు కోల్పోయింది. అయితే 15 పరుగుల తేడాతో ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కి చేసిన ఆస్ట్రేలియా కౌల్టర్ నైల్ 92 పరుగ్గులతో విధ్వంసక బ్యాటింగ్ చేసిన 50 ఓవర్లలో 273 పరుగుల లక్ష్యాన్నే వెస్టీండిస్ ముందు పెట్టగలిగింది. అయితే లక్ష్య చేదనలో ఊపుమీదున్న వెస్టిండీస్ జట్టును మిచ్చెల్ స్టార్క్ తన బౌలింగ్‌తో నడ్ది విరిచేసాడు. తన పది ఓవర్లలో కేవలం 46 పరుగులు మాత్రమే ఇచ్చి 5 కీలక వికెట్‌లు పడగొట్టాడు. అయితే ఈ వికెట్‌లు పడగొట్టదంతో వన్‌డేలలో అరుదైన రికార్డ్ను సొంతం చేసుకున్నాడు స్టార్క్. వన్‌డేలలో వేగవంతంగా 150 వికెట్లను పడగొట్టిన ఫాస్ట్ బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. మిచ్చెల్ స్టార్క్ మొత్తం 77 మ్యాచులలో 151 వికెట్లను తీయగలిగాడు. ఇంతకు ముందు ఉన్న పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ సాక్లైన్ పేరిట ఉన్న రికార్డ్‌ను చెరిపి వేశాడు. సాక్లైన్ 78 మ్యాచులలో 150 వికెట్లు పడగొట్టాడు. అయితే వన్‌డేలలో ఇప్పటివరకు ఆరుసార్లు ఐదు వికెట్లను పడగొట్టాడు స్టార్క్.