బ్రేకింగ్ న్యూస్ : రిటైర్మెంట్ ప్రకటించిన మిథాలీ రాజ్

Tuesday, September 3rd, 2019, 04:58:03 PM IST

ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం తీసుకుంది. టీ-20 క్రికెట్ నుండి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులో టీ-20 క్రికెట్ కి వీడ్కోలు పలికి పూర్తిస్థాయిలో వన్డేలకు తన సమయం కేటాయించాలని, 2021 లో జరిగే ప్రపంచ కప్ లో ఇండియాకి ఎలాగైనా టైటిల్ అందించటమే తన లక్ష్యమని అందుకే టీ-20 పార్మెట్ నుండి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది మిథాలీ రాజ్.

కెరీర్ లో ఇప్పటివరకు టీ-20 పార్మెట్ లో 89 మ్యాచ్ లు ఆడి 2364 పరుగులు చేసింది. ఇందులో 17 అర్ద సెంచరీలు ఉన్నాయి. ఈ ఫార్మేట్ లో 97 పరుగులతో నాట్ అవుట్ నిలిచింది, ఇదే ఆమె వ్యక్తిగత అత్యధిక స్కోర్. తన చివరి టీ-20 మ్యాచ్ 2019 మార్చి 9 న ఇంగ్లాండ్ తో ఆడింది. ఇందులో 32 బంతుల్లో 30 పరుగులు చేసింది. అయితే మిథాలీ రాజ్ రిటైర్ మెంట్ వెనుక మరో బలమైన కారణం ఉందని తెలుస్తుంది.

గతేడాది టీ-20 వరల్డ్ కప్ లో సెమీ-ఫైనల్స్ లో మిథాలీ రాజ్ నీ టీం పక్కన పెట్టింది. దీనిపై అప్పట్లో పెను దుమారమే రేగింది. ఆ సిరీస్ లో ఫామ్ లో ఉన్న మిథాలీనీ బెంచ్ కి పరిమితం చేయటం వెనుక కెప్టెన్ హర్మాన్ ప్రీత్ కౌర్ హస్తం ఉందని వార్తలు వచ్చాయి. అలాగే కోచ్ రమేష్ పొవార్ తో కూడా మిథాలీకి విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అవి కూడా ఇప్పడు మిథాలీ రిటైర్మెంట్ కి కారణమనే తెలుస్తుంది.