ధోనిపై ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్.. కారణం ఇదే..!

Friday, March 27th, 2020, 11:40:10 PM IST

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వ్యాధిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలను చేపడుతున్నాయి. అయితే ఇప్పటికే పలు రంగాలకు చెందిన ప్రముఖులు ప్రభుత్వాలకు తమ వంతు సహాయన్ని అందిస్తున్నారు.

అయితే క్రీడా రంగానికి చెందినవారిలో సచిన్ టెండూల్కర్ 50 లక్షలు, గంగూలీ 50 లక్షలు, పీవీ సింధు 10 లక్షలు విరాళాన్ని అందించారు. అయితే తాజాగా ఇండియన్ మాజీ కెప్టెన్, భారత క్రికెటర్ ధోని కూడా ముందుకు వచ్చి పూణేలోని పేదలను ఆదుకునేందుకు ప్రముఖ ఫండ్ రైసింగ్ సంస్థ కృషి చేస్తుండడంతో ఆ సంస్థకు లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. అయితే ఈ సంస్థ 12 లక్షల 50 వేల రూపాయలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ సంస్థకు ధోనీ లక్ష రూపాయలు ప్రకటించడంపై కొంత మంది ఆయనపై ప్రశంసలు కురిపిస్తుంటే మరికొంత మంది మాత్రం ధోనీపై విమర్శలు గుప్పిస్తున్నారట. క్రికెట్‌ ద్వారా వందల కోట్లు సంపాదించే ధోని కూడా కేవలం లక్ష రూపాయలు ఇవ్వడం సరికాదని అంటున్నారట.