చివరి వన్డేలో విజయం మాదే..ఎట్టి పరిస్థితుల్లో వదలం: న్యూజిలాండ్ బౌలర్

Thursday, October 26th, 2017, 05:27:18 PM IST

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఆడిన ప్రతి సిరీస్ లో మంచి ఆటను కనబరుస్తూ.. విజయాలను నమోదు చేసుకుంటోంది. ఆటగాళ్లు కలిసికట్టుగా రానిస్తుండడంతో జట్టుకు ప్రశంసలు కూడా బాగానే అందుతున్నాయి. ఇక వచ్చే వరల్డ్ కప్ లో అవకాశం దక్కించుకోవాలని ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు. ఎవరి స్థాయిలో వారు టాలెంట్ ని బయటపెడుతూ సెలక్టర్ల దృష్టిలో పడుతున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ వన్డే సిరీస్ లో భారత్ మొదటి వన్డేలో ఓడినా రెండో వన్డేలో తన సత్తాను చాటుకొంది.

ఎలాగైనా రెండో వన్డేలో గెలిచి మూడు వన్డేలా సిరీస్ ను దక్కిచుకుందాం అనుకున్న న్యూజిలాండ్ కి ఎదురుదెబ్బ తగిలింది. అయితే మూడో వన్డేలో మాత్రం తప్పకుండా గెలుస్తామని ఆ దేశపు ఆటగాడు స్పిన్న‌ర్ మిచెల్ సాంత్నార్ నమ్మకంగా చెబుతున్నాడు. రెండో వన్డేలో భారత బౌలర్లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారని చెబుతూ..ముఖ్యంగా తొలి పది ఓవర్లోనే 10 వికెట్లు పడగొట్టి ఒత్తిడికి గురి చేశారని చెప్పాడు. అయితే మూడో వన్డేలో మాత్రం తప్పకుండా తామే గెలుస్తామని ఎట్టి పరిస్థితుల్లో వన్డే సిరీస్ ని వదిలేది లేదని చెబుతున్నాడు. అలాగే భారత్ మెయిన్ బ్యాట్స్ మెన్ లను తొందరగా పెవిలియన్ కు పంపడానికి ప్రత్యేక వ్యూహాలను రచిస్తున్నట్లు చెప్పాడు.

  •  
  •  
  •  
  •  

Comments