IND vs NZ: భారత్‌కి భంగపాటు.. సునాయాసంగా నెగ్గిన కివీస్..!

Wednesday, February 5th, 2020, 04:38:25 PM IST


భారత్, న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన మొదటి వన్‌డే మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్‌కు భారత బ్యాట్స్‌మెన్స్ మంచి లక్ష్యాన్నే నిర్దేశించారు. ఓపెనర్లు పృథ్వీ షా 20 పరుగులు, మయాంక్ అగర్వాల్ 32 పరుగులు త్వరగానే ఔట్ అయినా కెప్టెన్ కోహ్లీ 51 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 103 పరుగులు రాణించడంతో భారత్ 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేయగలిగింది.

అనంతరం 348 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ను కట్టడి చేయడంలో భారత్ బౌలర్లు విఫలమయ్యారు. ఓపెనర్లు గుప్టిల్ 32 పరుగులు, నికోలస్ 78 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని అందించారు. ఆ తరువాత క్రీజ్‌లోకి వచ్చిన రాస్ టేలర్ సెంచరీతొ (109 పరుగులు) కదం తొక్కడం, కెప్టెన్ టామ్ లథమ్ 69 పరుగులు రాణించడంతో 48.1 ఓవర్లలోనే ఆరు వికెట్లు నష్టపోయి కివీస్ విజయాన్ని అందుకుంది. అయితే మూడు వన్‌డేల సిరీస్‌లో 1-0 తో కివీస్ ముందంజలో ఉంది. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్‌డే ఈ నెల 8వ తేదిన జరగనుంది.