కోహ్లీ : ఆట కన్నా ఆటగాళ్లే ముఖ్యం

Thursday, June 13th, 2019, 08:50:37 PM IST

క్రికెట్ ప్రపంచ కప్ లో భాగంగా నేడు ఇండియా కి మరియు న్యూజిలాండ్ కి మధ్యన జరగనున్న మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయిన సంగతి మనకు తెలిసిందే… ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ కొన్ని వాఖ్యలు చేశారు. తమకి ఆట కన్నా కూడా ఆటగాళ్లే ముఖ్యమని కోహ్లీ చెప్పారు. నేడు ఆట వలన చాలా నిరాశకు లోనయ్యాము. మా ఆటగాళ్ల మరియు జట్టు ద్రుష్టి ప్రకారం ఆడటానికి మైదానం సురక్షితంగా లేనప్పుడు ఆ మైదానం లో ఆడకపోవడమే మంచిది. ఎందుకంటే ఇలాంటి సమయంలో ఆటగాళ్లకు ఎలాంటి గాయాలు కాకపోవడమే శ్రేయస్కరం. మేము మా ఆటగాళ్లతో సహా ఇప్పటి వరకు కూడా మంచి ఆటనే ప్రదర్శించాము. మా ఆటకు ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు. మేము ఈ ప్రపంచ కప్ సీజన్ లో మేము ఇప్పటి వరకు సాధించిన విజయాలే మాకు నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. కాగా ప్రాక్టీస్ చేసే సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని, జాగ్రత్తగానే ఆడాలని మేము కోరుకుంటున్నాము. నేటి మ్యాచ్ కాకుండా ఆదివారం జరిగే మ్యాచ్ కి మేమందరం కూడా సన్నద్ధంగా ఉండాలని తయారవుతున్నాం. ఆదివారం నాడు జరిగే ఇండో పాక్ మ్యాచ్ లో ఎంత తొందరగా మైదానం లోకి వెళ్తే అంత తొందరగా వీలైతే అంత త్వరగా చేరుకోవాలని చూస్తున్నాము. ఆదివారం నాడు జరగనున్న మ్యాచ్ ప్రకారం మొదటిసారి ప్రపంచ కప్ ఆడుతున్నటువంటి ఆటగాళ్లు అందరు కూడా మానసికంగా సన్నద్ధం అవ్వాలని కోరుకుంటున్నామని చెప్పారు. మన టీంలో అందరు కూడా ఆట పరంగా అన్ని రకాలుగా ఆటతీరుని ప్రదర్శించడానికి రెడీగా ఉన్నారు… ఇలాంటి బృహత్కరమైన ఆటలో భాగమైనందుకు అందరు కూడా గౌరవంగా స్వీకరిస్తున్నామని కోహ్లీ చెప్పారు…