బిగ్ వైరల్: పీటీ ఉష, పీవీ సింధు వాటే కాంబినేషన్..!

Monday, August 26th, 2019, 10:21:28 PM IST

భారతదేశపు పరుగుల రాణి ఎవరంటే టక్కున వినబడే పేరు పీటీ ఉష. ఎందుకంటే పరుగుపందెంలో ఆమె సాధించిన ఘనత దేశానికి ఎంత గొప్ప పేరు తెచ్చి పెట్టిందో చెప్పనక్కర్లేదు. భారతదేశం తరుపున అంతర్జాతీయ స్థాయిలో జరిగే పరుగు పందెంలలో ఎన్నో సార్లు విజయం సాధించి చెప్పలేనన్ని బహుమతులను సాధించి పెట్టింది. అప్పట్లో ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో ఫైనల్స్ చేరిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది పీటీ ఉష. ఆమె దేశానికి సాధించిపెట్టిన ఖ్యాతికి గుర్తుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ మరియు అర్జున అవార్డు లతో ఆమెను సత్కరించింది.

ఇక బ్యాడ్మింటన్ అనగానే గుర్తొచ్చే పేరు పీవీ సింధు. ఈమె కూడా చిన్న వయస్సులోనే అంతర్జాతీయ స్థాయి ఆటలో దేశానికి ఎన్నో బహుమతులను సాధించిపెట్టింది. అత్యనత చిన్న వయస్సులో ఒలంపిక్స్ లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా పేరు సంపాదించింది. అయితే ఈమె క్రీడా స్పూర్థిని అభినందిస్తూ పద్మశ్రీ మరియు అర్జున అవార్డులను అందించింది భారత ప్రభుత్వం. అయితే తాజాగా పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. అయితే పీటీ ఉష ఆమెకు అభినందనలు తెలుపుతూ పీవీ సింధు చిన్నప్పుడు తనతో కలిసి దిగిన ఫోటోను ట్వీట్ చేసింది. వీరిద్దరి కలిసి దిగిన ఆ ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. పీటీ ఉష కుర్చీలో కూర్చుని తన మోకాలిపై చిన్న వయసులో ముద్దు ముద్దుగా ఉన్న పీవీ సింధును కూర్చొబెట్టుకుని ఉంది. అయితే వీరిద్దరిని చూస్తుంటే ఇద్దరు ఛాంపియన్లు భలేగా ఉన్నారని మీరిద్దరు దేశానికి గర్వ కారణమని నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయట.