మరోసారి దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో పీవీ సింధు పేరు.!

Sunday, August 25th, 2019, 09:58:51 PM IST

ఒలింపిక్స్ లో వెండి పథకాన్ని సాధించిన రెండవ భారత మహిళా బ్యాడ్మింటన్ ప్లేయర్ గా తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు దేశ వ్యాప్తంగా ఎంత పేరు తెచ్చుకుందో అందరికి తెలుసు కానీ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లోని బంగారు పథకం మాత్రం ఈమెకు అందని ద్రాక్షలానే మిగిలిపోయింది.వరుసగా రెండు సార్లు 2017,2018లలో ఫైనల్స్ వరకు వచ్చి రెండవ స్థానంలో నిలిచి వెండి పతకంతో సరిపెట్టుకుంది.కానీ మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో మరోసారి సారి తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది.

ఈసారి జరిగినటువంటి ప్రపంచ బాడ్మింటను ఛాంపియన్ షిప్ లో బంగారు పతాకాన్ని సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది.తన ప్రత్యర్థి అయినటువంటి జపాన్ దేశస్థురాలు నోజోమి ఒకుహరా పై 21-7,21-7 తో నెగ్గి విజయకేతనాన్ని ఎగురవేసింది.ఈ పతాకాన్ని ఈ రోజు తన తల్లి జన్మదినం సందర్భంగా ఆమెకు అంకితం ఇస్తున్నానని ప్రకటించి తన తల్లితో పాటు మొత్తం భారతదేశ ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని నింపింది.దీనితో దేశ రాజకీయ నాయకులు సహా మన టాలీవుడ్ నటులు కూడా సింధుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.