సింధుని ప్రత్యేకంగా అభినందించిన మోదీ..

Wednesday, August 28th, 2019, 08:20:25 AM IST

రెండు సార్లు కాంస్యాలు, రెండు సార్లు రజతాలు సాధించిన కానీ ఎదో తెలియని వెలితితో మరోసారి ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్న సింధు ఈ సారి తన స్వర్ణ దాహం తీర్చుకుంది. జపాన్ కి చెందిన ఒకుహరతో పోరాడి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత్ తరుపున తొలి స్వర్ణం సాధించిన ఘనతను సొంతం చేసుకుంది సింధు. ఆమె సాధించిన అపూర్వ విజయానికి భారతావని పులకించిపోయింది.

స్వర్ణం గెలిచిన తర్వాత స్వదేశానికి వచ్చిన సింధు ప్రధాని కార్యాలయంలో మోదీని కలిసింది. ఆమెతో పాటుగా కోచ్ లు గోపీచంద్, కిమ్ ఇద్దరు కూడా ఉన్నారు. ‘దేశానికి గర్వకారణమైన ఈ ఛాంపియన్‌ మన ఇంటికి స్వర్ణంతో పాటు సంతోషాన్ని తీసుకొచ్చింది. సింధును కలవడం సంతోషం కలిగించింది. ఆమెను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని అభిలషిస్తున్న” అంటూ మోదీ చెప్పటం జరిగింది.