డోంట్ మిస్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రివర్స్ షాట్..!

Tuesday, March 3rd, 2020, 07:26:08 PM IST


ప్రస్తుతం క్రికెట్ ఆట గురుంచి తెలియని వారు ఉండరు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఎక్కువగా ఇష్టమైన ఆట క్రికెట్ అనే చెప్పాలి. అయితే క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా చెప్పుకుంటే పోతుంటే ప్రతి ఒక్కటి ఒక విశేషమే.

క్రికెట్ ఆటలో మనం ఇప్పటి వరకు ఎన్నో రకాల షాట్‌లను ఆడుంటాము, చూసుంటాము. కానీ ఒక వ్యక్తి ఆడిన షాట్ మాత్రం ఖచ్చితంగా ఇంతకు ముందెన్నడూ చూసి కానీ, ట్రై చేసి కానీ ఉండమనే చెప్పాలి. ఎందుకంటే వేగంగా వచ్చిన బంతిని తన పొజీషన్ మార్చుకోకుండా కేవలం బ్యాట్ పొజీషన్ మార్చుకుని అది కూడా రెండు కాళ్ళ మధ్యలో నుంచి రివర్స్‌లో సింపుల్‌గా కొట్టిన షాట్ బౌండరీనీ తాకింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసి ఇలాంటి షాట్‌ని ఆడేందుకు ట్రై చేసి చూడండి.