యూఎస్ ఓపెన్‌ నుంచి నిష్క్రమించిన రోజర్ ఫెదరర్‌

Tuesday, September 3rd, 2013, 05:47:32 PM IST

Fedex

యూఎస్ ఓపెన్‌లో టాప్ సీడ్లు మెరుగ్గా రాణించలేకపోతున్నారు. న్యూయార్క్ నగరంలో జరుగుతున్న యూఎస్ ఓపెన్ నాలుగో రౌండ్లో స్విజ్ మాస్టర్ రోజర్ ఫెదరర్‌కు చుక్కెదురైంది. స్పానిష్ 19వ సీడ్ టామీ రాబ్రెడో చేతిలో రోజర్ ఫెదరర్ ఖంగుతిన్నాడు. ఆద్యంతం మెరుగ్గా రాణించినా రాబ్రెడోను అధిగమించడంలో ఫెదరర్ విఫలమయ్యాడు. ఫలితంగా 7-6 (7/3), 6-3, 6-4 పాయింట్ల తేడాతో రాబ్రెడో చేతిలో ఓడిపోయాడు రోజర్ ఫెదరర్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాడు.సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ క్వార్టర్ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకున్నాడు.