బ్రేకింగ్: అద్దిరిపోయే రికార్డులు నెలకొల్పిన రోహితశర్మ

Saturday, October 19th, 2019, 03:51:47 PM IST

కష్టకాలంలో లో ఆదుకొనే క్రికెటర్ టీమిండియా లో ఎవరైనా వున్నారంటే అది ఇపుడు రోహిత్ శర్మనే. దక్షిణాఫ్రికా తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచులను గెలిచి సిరీస్ కైవసం చేసుకొని వైట్ వాష్ చేయడానికి టీం ఇండియా సిద్ధమైంది. మొదట మూడు వికెట్లు కోల్పోయిన టీం ఇండియా, ఆ తరువాత రోహిత్ శర్మ రాకతో మంచి స్కోర్ ని చేయగలిగింది. ఈ టెస్ట్ మ్యాచ్ లో శతకం తో చెలరేగిపోయిన రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు ని నెలకొల్పాడు. ఏదైనా టెస్ట్ సిరీస్ లో అత్యధికంగా సిక్సులు కొట్టిన ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కాడు.

భారత్ తరపున అత్యధిక సిక్సులు కొట్టిన రికార్డు కూడా బద్దలు కొట్టాడు. ఆరవ శతకాన్ని నమోదు చేసుకున్న రోహిత్ శర్మ ఈ సిరీస్ లోనే మూడు శతకాలు కొట్టడం గమనార్హం. అంతే కాకుండా టెస్టుల్లో రోహిత్ శర్మ రెండు వేల పరుగుల మైలురాయిని చేరుకోవడం మరొక విశేషం. రహానే అర్ద శతకం, రోహిత్ శతకం తో భారత్ గాడిలో పడ్డట్లు అయింది. మరి ఈ పరుగుల వరదలో రోహిత్ ఇంకెన్ని రికార్డులు నెలకొల్పుతాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే.