హాట్ టాపిక్: రోహిత్ శర్మను కింద పడేసిన అభిమాని

Saturday, October 12th, 2019, 03:47:28 PM IST

క్రికెట్ చరిత్రలో తన పేరుని సువర్ణాక్షరాలతో లిఖించుకున్న మేటి క్రికెటర్ రోహిత్ శర్మ. దక్షిణాఫ్రికా తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో రోహిత్ శర్మ బాటింగ్ చూసిన వారు ఎవరైనా ఔరా అనాల్సిందే. అయితే రెండో టెస్ట్ మ్యాచ్ పూణే వేదికగా జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. రోహిత్ శర్మ వద్దకు ఒక అభిమాని రావడమే కాకుండా కాలుని ముద్దాడేందుకు ప్రయత్నించాడు. పట్టుకోల్పోయిన రోహిత్ కింద పడ్డాడు. అయితే అక్కడే వున్న రహానే కూడ పక్కకి వెళ్లాల్సిందిగా అభిమానిని కోరాడు.

ఇప్పటివరకు మహేంద్ర సింగ్ ధోని కి, విరాట్ కోహ్లీ కి ఇలాంటి అభిమానులను చూసాం. తాజాగా రోహిత్ ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. రోహిత్ కెరీలో అత్యద్భుత ఫామ్ ని కనబరచడమే కాకుండా, జట్టు విజయాలలో కీలకం అయ్యాడు. వన్డే జట్టు కెప్టెన్ గా రోహిత్ ని నియమించాలని గంభీర్, యువరాజ్ సింగ్ లు పరోక్షంగా తమ అభిప్రాయాన్ని తెలిపిన సంగతి అందరికి తెలిసిందే. రోహిత్ దక్షిణాఫ్రికా తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ తొలి మ్యాచ్ లో అద్భుతమైన ఆటతీరుతో టెస్ట్ ల లోను తన ముద్ర వేసాడు.