IND vs ENG సెకండ్ టెస్ట్: సెంచరీతో కదంతొక్కిన రోహిత్ శర్మ..!

Saturday, February 13th, 2021, 02:31:41 PM IST

చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో మెుదటి ఇన్నింగ్స్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు అదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. యువ ఓపెనర్ శుభమన్ గిల్, కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్ కావడం, మరో బ్యాట్స్‌మెన్ ఛటేశ్వర్ పుజారా 21 పరుగులకే ఔట్ అవ్వడంతో 106 పరుగులకే భారత్ 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

అయితే ఓ పక్క వికెట్లు పడుతున్నా ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ శర్మ ఇంగ్లీష్ బౌలర్లపై కౌంటర్ అటాక్ మొదలుపెట్టాడు. ఎడాపెడా బౌడరీలు బాదుతూ కేవలం 130 బంతుల్లోనే సెంచరీనీ పూర్తి చేసుకున్నాడు. వైస్ కెప్టెన్ రహానేతో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సెంచరీతో రోహిత్ శర్మ తన టెస్టు కెరీర్‌లో 7వ సెంచరీనీ పూర్తి చేసుకున్నాడు.