సాహో .. మరొకసారి అజ్ఞాతవాసిని బయటికి లాగిన డైరెక్టర్.

Monday, September 2nd, 2019, 10:07:53 PM IST

సాహో చిత్రం పై మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేసారు లార్గో వించ్ చిత్రం దర్శకుడు జెరోమ్ సల్లే . తన సినిమాని కాపీ చేశాడంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహించాడు. అది ఆలా ఉంచితే తెలుగు దర్శకుల ఫై కూడా ఘాటుగానే కామెంట్లు చేసాడు. లార్గో వించ్ ఫ్రీమేక్ ని మొదటి దాని కంటే చెత్తగా తీశారని, కానీ నాదొక విన్నపం నా పనిని చోరీ చేస్తే దానిని సరిగా చేయండి అంటూ తెలిపారు. అజ్ఞాతవాసి సమయం లో కూడా నోరు మెదిపిన డైరెక్టర్ ఈ సారి ఇలా తెలపడం ఫ్యాన్స్ కి బాగా కోపం తెపించినట్లుంది.

అయితే దీనికి ప్రతి చర్యగా ఫ్యాన్స్ లార్గో వించ్ డైరెక్టర్ పై ఘాటుగా సెటైర్లు వేస్తున్నారు. సినిమా చూసి మాట్లాడాలని, సాహో చిత్రం మీ చిత్రంతో పోల్చడానికి అక్కడ ఏమి లేదని అంటున్నారు. తండ్రిని చంపిన వారిని కొడుకు రివెంజ్ తీసుకోవడం ఎన్ని సినిమాల్లో లేదు అంటూ విమర్శిస్తున్నారు. దీనివల్ల ఆ చిత్ర దర్శకుడికి వొదిగిందేమి లేదు, ఇంకా దీనివల్ల సాహో చిత్రానికి ఫ్రీ పబ్లిసిటీ వచ్చినట్లుగా కొంతమంది భావిస్తున్నారు. మూడు రోజుల్లోనే 294 కోట్లు కొల్లగొట్టిందంటేనే సాహో స్టామినా ఏంటో చెప్పొచ్చు.