ప్రపంచ క్రికెట్ చరిత్రలో..ఇదే రోజున చరిత్ర సృష్టించిన మాస్టర్ బ్లాస్టర్!

Monday, February 24th, 2020, 02:47:41 PM IST

ప్రపంచంలోని అత్యంత పాపులర్ అయిన అతి పెద్ద క్రీడగా క్రికెట్ కు ఎంత గొప్ప పేరు ఉందో అందరికీ తెలిసిందే.అయితే ఈ క్రికెట్ చరిత్రలోనే ఎంతో మంది గుర్తుండిపోయే ఆటగాళ్లు ఉన్నారు.అలాగే చరిత్రలో నిలిచిపోయే రికార్డులు కూడా అనేకం ఉన్నాయి.కానీ అలాంటి గుర్తుండిపోయే రికార్డులు గుర్తుండిపోయే ఆటగాడు ఎవరు అంటే అది “మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేష్ టెండూల్కర్” అని చెప్పాలి.అలా సచిన్ ఒక వ్యక్తిగానే కాకుండా అద్భుతమైన ఆటగానిగా ఎన్నెన్నో మైలురాయిలు అందుకున్నారు.

అయితే అప్పట్లో క్రికెట్ చరిత్రలో ఒన్డే ఇన్నింగ్స్ లో ఒకే ఆటగాడు డబుల్ సెంచరీ చెయ్యడం అంటే అది ఎంతో ప్రతిష్టాత్మకం.అప్పటికే చాలా 180లు దగ్గరకు వచ్చి ఆగిపోయిన వారు ఉన్నారు.కానీ మొట్టమొదటి డబుల్ సెంచరీ మన దేశపు ఆటగాడు అయినటువంటి సచిన్ పేరు తోనే మొదలు కావాలి అన్నట్టుగా సరిగ్గా ఇదే రోజున పదేళ్ల క్రితం 2010లో దక్షిణ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 147 బంతుల్లో 200 పరుగులు తీసి ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఎవరు అందుకోని రికార్డును నెలకొల్పారు.ఈ విషయాన్నే గుర్తు చేస్తూ భారత్ క్రికెట్ అకాడమీ వారు చరిత్ర సృష్టించిన ఈ షాట్ వీడియో చూపించారు.