టీమిండియాపై నమ్మకముంది: సచిన్

Thursday, February 12th, 2015, 11:42:28 AM IST


వరల్డ్ కప్ 2015 త్వరలో ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో రాజ్యసభ సభ్యుడు, భారత్ ప్రముఖ క్రికెట్ ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ కప్ టైటిల్ ను భారత్ సొంతం చేసుకుంటుందనే పూర్తి నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియాలో ఉందని, అక్కడ ఎన్నో సవాళ్ళను ఎదుర్కుంటోందని సచిన్ అభిప్రాయపడ్డారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ సునీల్ గవాస్కర్, వివియన్ రిచర్డ్స్ తన ఫేవరేట్ ఆటగాళ్ళని, భారీ లక్ష్యాన్ని ఎలా ఎదుర్కోవాలో, అత్యధిక స్కోర్ ఎలా సాధించాలో వారి వద్దే నేర్చుకున్నానని తెలిపారు. అలాగే క్రికెట్ కంటే ఎక్కువ టెన్నీస్ ను ఇష్టపడతానని, వీటితో పాటు బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ కూడా ఇష్టమని సచిన్ తెలిపారు. ఇక ప్రపంచ కప్ లో ఉత్తమ ప్రదర్శన చేసిన వారి జాబితాలో తన పేరు టాప్ లో ఉండడం ఆనందకరమని, అందరూ అలాగే రాణించాలని సచిన్ పేర్కొన్నారు.