సెలెక్టర్ ని బెదిరించిన కోచ్ సంజయ్ బంగర్…హోటల్ గదిలో హెచ్చరిక

Wednesday, September 4th, 2019, 03:55:52 PM IST

టీం ఇండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ చేసిన దారుణమైన సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనను మరోసారి బ్యాటింగ్ కోచ్ గా ఎంపిక చేయకపోతే దారుణమైన పరిణామాలు ఉంటాయని సెలెక్టర్ దేవాంగ్ గాంధీని అతని రూమ్ లోకి వెళ్లి బెదించిన సంఘటన ఇప్పుడు క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాశంగా మారిపోయింది. అసలు వివరాల్లోకి వెళితే టీం ఇండియా కోచ్ ల పదవి కాలం వరల్డ్ కప్ తర్వాత ముగిసిపోయింది.

అయితే వెస్టిండీస్ టూర్ నేపథ్యంలో మరో 45 రోజులు పొడిగించారు. ఇక ప్రధాన కోచ్ గా మళ్ళీ రవి శాస్త్రికి పట్టం కట్టారు. అలాగే మిగిలిన సహాయక కోచ్ లుగా భరత్,అరుణ్ లను కొనసాగించిన సెలెక్టర్లు సంజయ్ బంగర్ ని మాత్రం పక్కన పెట్టారు. టీం ఇండియాలో కీలకమైన నాలుగో స్థానంలో ఆడే అతగాడిని దాదాపు నాలుగేళ్ళ నుండి సెట్ చేయకపోవటం, బాగానే కుదురుకున్న రాయుడిని పక్కకు తప్పించి విజయ్ శంకర్ కి దారి ఇవ్వటం వంటి వాటిల్లో సంజయ్ హస్తం ఉందని సమాచారం.

అలాగే అతను ఆటగాళ్లతో కలిసి ఉండే విధానంలో కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చాయి, వాటిని దృష్టిలో పెట్టుకొని అతన్ని మరోసారి సెలెక్ట్ చేయలేదు. రెండు వారాల క్రితం హోటల్ గదిలో ఉన్న సెలెక్టర్ దేవాంగ్ గాంధీ రూమ్ దగ్గరకి వెళ్లి తలుపు కాలితో తన్ని, నాకు టీం సపోర్ట్ చాలా ఉంది, నన్ను తప్పితే వాళ్ళు ఊరుకోరు కాబట్టి నన్ను సెలెక్ట్ చేయండి, లేకపోతే కనీసం జాతీయ క్రికెట్ టీం లో అయిన ఎదో ఒక పోస్ట్ ఇవ్వండని అతనితో అమర్యదగా మాట్లాడినట్లు తెలుస్తుంది. దీనిపై విచారణ చేపట్టిన బీసీసీఐ, టీం ఇండియా మేనేజర్ మరియు రవిశాస్త్రి లను దీనిపై నివేదికలను ఇవ్వమని ఆదేశించింది.