డబుల్ సెంచరీ మిస్ అయినందుకు క్షమాపణలు చెప్పిన సెహ్వాగ్

Friday, October 20th, 2017, 01:00:40 AM IST

క్రికెట్ లో కొంత మంది బ్యాట్స్ మేన్స్ ఆటను చూస్తే అలా.. చూస్తూ ఉండిపోతాం. బౌలర్ పై దయ లేకుండా బంతులను బౌండరీలకు తరలిస్తే ఆ మజానే వేరు. అటువంటి వారిలో దక్షిణాఫ్రికా ఆటగాడు ఎబి డివిలియర్స్ ఒకడు. అతని ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటువంటి వారి బౌలింగ్ లో అయినా సిక్సర్ల మోత మోగించగలడు. అయితే గత కొంత కాలంగా ఈ ఆటగాడు ఫామ్ లో లేడు. జట్టులో స్థానాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది.

అయితే మళ్లీ రీసెంట్ గా బంగ్లాదేశ్ సిరీస్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అంతే కాకుండా తన బ్యాట్ బలాన్ని మరోసారి రుచి చూపించాడు. 104 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్సర్లు బాది 176 పరుగులు సాధించాడు. అయితే ఆతని ఆట తీరుపై పలువురు క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలను అందించారు. కానీ సెహ్వాగ్ మాత్రం వెరైటీగా స్పందించాడు. వన్డేలో డివిలియర్స్ ఆడిన ఆట అమోఘమని.. అతను డబుల్ సెంచరీ సాదిస్తాడని అనుకున్నా.. కానీ ఏబీ సాధించలేదంటూ.. డబుల్ సెంచరీ ఘనతను అందుకోలేకపోయిన ఏబీకి సారీ’ అని సెహ్వాగ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపాడు.

  •  
  •  
  •  
  •  

Comments