హాట్ టాపిక్: గంగూలీ పై బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు.

Wednesday, October 16th, 2019, 12:23:16 PM IST

బీసీసీఐ అధ్యక్ష పదవి దాదా ని వరించిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే దేశంలోని ప్రముఖులు, అభిమానులు సౌరవ్ గంగూలీ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాజాగా గంగూలీ పై పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అప్పటి భారత్ పరిస్థితులను తలచుకొని గంగూలీ పై ప్రశంసలు కురిపించారు. సారధిగా గంగూలీ పగ్గాలు చేపట్టాక భారత్ ఆటగాళ్ల ధోరణి, ఆలోచన విధానం మారిందని అన్నారు. అంతగా గంగూలీ మాటలు ఆటగాళ్ల పై ప్రభావం చూపించాయని షోయబ్ అక్తర్ అన్నారు.

భారత్ క్రికెట్ రూపురేఖల్ని మార్చిన గంగూలీ గురించి ఆలా మాట్లాడుతూనే వున్నారు షోయబ్. గంగూలీ రాకమునుపు పాకిస్తాన్ పై భారత్ ఎప్పుడూ గెలుస్తుంది అని అనుకోలేదు, గంగూలీ వచ్చాక గొప్ప గొప్ప ఆటగాళ్ళని వెలికి తీసాడు, అత్యుత్తమ నైపుణ్యాల్ని వెలికితీసి ఎంతో బాగా సారథ్యం వహించారు అని అన్నారు. గంగూలీ ఒక నిజాయితీ పరుడు అని అన్నారు. క్రికెట్ పై అత్యుత్తమ అవగాహనా కలిగిన వాడు అని షోయబ్ అక్తర్ అన్నారు. గంగూలీ ఈనెల 23 న బీసీసీఐ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టనున్న సంగతి అందరికి తెలిసిందే.