టీం ఇండియా ఎక్స్ ఫాక్టర్ బుమ్రానే—షోయబ్ అక్తర్!

Monday, February 3rd, 2020, 02:59:35 PM IST

న్యూజిలాండ్ తో జరిగిన 5 వ టీ 20 మ్యాచ్ గురించి షోయబ్ అక్తర్ స్పందించారు. అయితే ఈ మ్యాచ్ భారత్ గెలుస్తుందని అసలు అనుకోలేదని అన్నారు. మ్యాచ్ పది ఓవర్లు న్యూజిలాండ్ వైపే ఉండగా, ఆ తరువాత భారత్ పుంజుకుంది అని అన్నారు. దీనికి కారణం టీం ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అని అన్నారు. మ్యాచ్ గెలవడానికి గల కారణం బుమ్రా అంటూ పొగడ్తలతో ముంచేశారు. అయిదు మ్యాచ్ ల సిరీస్ లో చివరగా జరిగిన మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్లు వేసి ఒక మెయిడెన్ తో పాటుగా కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

అయితే బుమ్రా బౌలింగ్ ని కొనియాడుతూ షోయబ్ అక్తర్ ఇలా అన్నారు. బుమ్రా బౌలింగ్ నిజంగా అసాధారణం, మూడు వికెట్లు 12 పరుగులు, ఇదొక అద్భుతమైన బౌలింగ్. టీమిండియా మ్యాచ్ గెలిచిందంటే దానికి కారణం బుమ్రానే. అయితే బుమ్రా గాయం తర్వాత గాడిలో పడటానికి రెండు నుండి మూడు మ్యాచ్ లు మాత్రమే తీసుకోవడం జరిగింది. అయితే చాలామంది బౌలర్లకు రిథమ్ అందుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ, బుమ్రా త్వరగా పూర్తీ స్వింగ్ అందిపుచ్చుకున్నాడు. అయితే బుమ్రా ఎపుడు డెత్ ఓవర్ లో 25 నుండి 30 పరుగులు ఇచ్చిన దాఖలాలు ;లేవు. సైనీ, శార్దూల్ లు మెరుగైన బౌలింగ్ వేసినప్పటికీ టీం ఇండియా ఎక్స్ ఫాక్టర్ మాత్రం బుమ్రా నే అని షోయబ్ అక్తర్ పొగడ్తలతో ముంచేశాడు.