హాట్ టాపిక్: సచిన్ ని గుర్తు చేసావ్…రోహిత్ ఫై పాక్ మాజీ పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Monday, January 20th, 2020, 04:53:22 PM IST

ఆస్టేలియా తో జరిగిన మూడో వన్డేలో చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి భారత జట్టుని విజయతీరాలకు చేర్చాడు రోహిత్ శర్మ. సెంచరీ తో కదం తొక్కి అత్యద్భుత బౌండరీలు పెవిలియన్ కి చేర్చి ఆసీస్ గుండెల్లో గుబులుని నింపాడు. అయితే ఈ ఇన్నింగ్స్ ఫై పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ స్పందించారు. రోహిత్ శర్మ బ్యాటింగ్ ని కొనియాడారు. 287 పరుగుల లక్ష్యాన్ని టీంఇండియా సునాయాసంగా గెలవడానికి కారణం రోహిత్ శర్మ, 119 పరుగులో 8 ఫోర్లు, 6 సిక్సర్లని బాదాడు. అయితే రోహిత్ శర్మ ఆడిన అప్పర్ కట్ సిక్సులపై షోయబ్ అక్తర్ ప్రశంసలు కురిపించారు.

రోహిత్ ఒక్కసారి టచ్ లోకి వస్తే అతనిని ఆపడం కష్టమని పేర్కొన్నారు. మంచి బంతా, చెడ్డ బంతా అనే ఆలోచన ఉండదు రోహిత్ బాట్ నుండి మంచి షాట్లు చాల ఈజీ గా వస్తాయి అని పేర్కొన్నారు. ఫాస్ట్ బౌలింగ్ లో రోహిత్ శర్మ కొట్టిన అప్పర్ కట్ సిక్సులతో సచిన్ ని గుర్తు చేసావ్ అని అన్నారు. 2003 వరల్డ్ కప్ లో సచిన్ ఆడిన అప్పర్ కట్ సిక్సు ని గుర్తు తెచ్చుకొని ఇలా అన్నారు. సచిన్ టెండూల్కర్ నా బౌలింగ్ లో ఇలానే సిక్సులు కొట్టాడు. సెంచూరియన్ లో జరిగిన మ్యాచ్ లో సచిన్ థర్డ్ మాన్ అప్పర్ క్యూ షాట్ నాకు ఇప్పటికి గుర్తే, దాన్ని నువ్వు మరోసారి తలపించావ్. స్టార్క్, కమ్మిన్స్ బౌలింగ్ లో కొట్టిన ఆ షాట్లతో సచిన్ ఆడిన ఆ నాటి షాట్లని గుర్తు చేసావ్ అని అన్నారు. ఈ సిరీస్ విజయం ఫై టీం ఇండియా లో నూతనోత్సహం పెరగడమే కాకా భారత్ తన బలాన్ని ప్రపంచానికి మరొకసారి చాటిచెప్పింది.