కోల్ కత్తా నైట్ రైడర్స్ కు కోచ్ గా ఉండేందుకు సిద్దం…ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన షోయబ్ అక్తర్

Tuesday, May 5th, 2020, 09:43:15 PM IST

గత కొద్ది రోజులుగా టీం ఇండియా క్రికెటర్ల పై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోయారు. నిత్యం భారత్ బ్యాట్స్ మెన్, బౌలర్ ల పై కామెంట్లు చేసే షోయబ్ అక్తర్ తాజాగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీం ఇండియా బౌలింగ్ కోచ్ గా కూడా పని చేసేందుకు షోయబ్ అక్తర్ ఆసక్తి చూపుతున్నారు. అవకాశం వస్తే కొల్ కతా నైట్ రైడర్స్ కు కోచ్ గా చేసేందుకు కూడా సిద్దమని ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.

అయితే భారత్ కు కోచ్ గా వ్యవహరించుట వలన మరింత దూకుడుగా, వేగంగా, మాట్లాడే పేసర్ లను తయారు చేస్తా అను షోయబ్ అక్తర్ అన్నారు. అంతేకాక పేసర్ బౌలర్ అవ్వడం ములనా తన బౌలింగ్ నైపుణ్యాన్ని మరింతగా అందజేసి మిగతా పేసర్ లకు సమర్దవంతంగా తయారు చేసి చూపుతా అని వ్యాఖ్యానించారు. అయితే ఐపీఎల్ టీం అయినటువంటి కోల్ కతా నైట్ రైడర్స్ కు కోచ్ గా చేసేందుకు కూడా సిద్దమని తెలియచేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. మరి షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలకు టీం ఇండియా యాజమాన్యం, కోల్ కతా నైట్ రైడర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.