సచిన్ ని అధిగమించిన స్మిత్.. అందరి కళ్ళు అతని పైనే

Friday, September 6th, 2019, 01:01:36 PM IST

క్రికెట్ లో యువతరం క్రికెటర్లు తమ అద్భుత ప్రదర్శనలతో, ఆటతీరుతో ప్రేక్షకులని కట్టిపడేస్తున్నారు. యాషెస్ టెస్ట్ సిరీస్ లో ఆసీస్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ పరుగుల వరద పారిస్తున్నాడు. మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లో రెండు శతకాలు బాదిన అతను నాల్గవ టెస్టులో ద్విశతకం తో క్రికెట్ అభిమానులని అలరించాడు. టీం అని ఒంటి చేత్తో నడిపిస్తున్నాడు. అయితే డబల్ శతకం తో స్టీవ్ స్మిత్ తన 26 వ టెస్ట్ సి సెంచరీ ని నమోదు చేసుకున్నాడు.

టెస్టుల్లో ఇప్పటివరకు బ్రాడ్మన్ వేగంగా 26 సెంచరీలు చేయగా, సచిన్ టెండూల్కర్ తర్వాతి స్తానం లో వున్నారు. అయితే స్మిత్ 121 ఇన్నింగ్స్ లో 26 శతకాలు చేయగా, సచిన్ 136 ఇన్నింగ్స్ లో 26 శతకాలు చేసారు. బ్రాడ్మన్ వేగంగా 69 ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ ని సాధించారు. ఇపుడు స్మిత్ సచిన్ ని అధిగమించడం తో అతని ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుత యువతరం ఆటగాళ్లలో స్టీవ్ స్మిత్ తన అట తీరుతో అందరిని ఆకట్టుకుంటూ, జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు.