మా కాలంలో అతి పెద్ద మ్యాచ్ విజేత అతనే–సౌరవ్ గంగూలీ

Monday, December 30th, 2019, 02:07:41 PM IST

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ గురించి క్రికెట్ అభిమానులకి తెలియనిది కాదు. సరిగ్గా చెప్పాలంటే క్రికెట్ ని తన మార్క్ కెప్టెన్సీ తో ఏలాడని చెప్పాలి. అయితే సచిన్, ద్రావిడ్, సెహ్వాగ్, గంభీర్, లక్ష్మణ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లతో ఆడి గంగూలీ చారిత్రాత్మక విజయాలు నమోదు చేయడం జరిగింది. అయితే అప్పటికాలంలో సెహ్వాగ్ మ్యాచ్ విన్నర్ అని అన్నారు. అయితే ఓపెనర్ గా దిగామని నేనే చెప్పా అంటూ గంగూలీ అన్నారు. మ్యాచ్ లో ఎన్నవ స్థానంలోనైనా ఆడేట్లుగా సిద్ధంగా ఉండాలని, కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి ఆడాలని సూచించానని అన్నారు.

అయితే సునీల గవాస్కర్ ఇండియా కి ఉత్తమ ఓపెనర్ గా అభివర్ణిస్తాం, కానీ సెహ్వాగ్ అతనికి ఏమాత్రం తీసిపోడు అని అన్నారు. ఒకరు ఆఫ్ స్టంప్ బయటికి పంపిస్తే బంతి పాతపడుతుందని, మరొకరు బంతి పాతపడేవరకు బాదుతూనే ఉంటారని గంగూలీ అన్నారు. అయితే సెహ్వాగ్ ని ఓపెనర్ గా దింపి రాణించడానికి గంగూలీ కారణమని చెప్పాలి. సెహ్వాగ్ బ్యాటింగ్ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించేది. టెస్టుల్లో కూడా దూకుడు గా ఆడే స్వభావం సెహ్వాగ్ ది మాత్రమే.