ఏదేమైనా ఐపియల్ లేకుండా 2020 ముగిసిపోవద్దు – గంగూలీ!

Thursday, July 9th, 2020, 12:03:54 AM IST


భారత్ లో జరగాల్సిన ఐపియల్ 2020 ఇంకా మొదలు కాలేదు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశంలో జరగాల్సిన ఐపియల్ వాయిదా పడింది. అయితే దీని నిర్వహణ పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపియల్ మేము నిర్వహిస్తాం అని వివిధ దేశాలు చెబుతున్న వ్యాఖ్యలు అంటూ మీడియా ద్వారా నే మేము వింటున్నాం అని అన్నారు. అయితే ఇప్పటి వరకూ అల ఎవరు, ఏ బోర్డ్ కూడా తమను సంప్రదించలేదు అని గంగూలీ తెలిపారు.

అయితే తొలి ప్రాధాన్యత భారత్ అని గంగూలీ తెలపగా, 35 నుండి 40 రోజుల సమయం దొరికినా ఐపియల్ నిర్వహణ కి చాలు అని అన్నారు. అయితే లీగ్ లో ఉన్నటువంటి ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్కతా లాంటి పెద్ద జట్లు ఉన్న ప్రాంతాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి అని, అలాంటపుడు క్రికెట్ నిర్వహిస్తాం అని చెప్పలేం. కాకపోతే భారత్ లో ఇపుడే ఐపియల్ నిర్వహిస్తాం అని చెప్పడం కూడా కుదరదు అని వ్యాఖ్యానించారు. అయితే చివరగా ఎదేమైనా ఐపియల్ లేకుండా 2020 ముగిసిపోవడ్డు అని కంకణం కట్టుకున్నాం అని గంగూలీ తెలిపారు. అయితే గంగూలీ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ అభిమానులకు కాస్త సంతోషాన్ని కలిగించాయి అని చెప్పాలి.