ఇపుడు క్రీడలు నిర్వహించే పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి… ఐపీఎల్ ను మర్చిపోండి – సౌరవ్ గంగూలీ

Sunday, April 12th, 2020, 04:55:52 PM IST


బీసీసీఐ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ప్రస్తుతం భారత్ లో జరగాల్సిన ఐపీఎల్ పై సైతం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇపుడు ఉన్న పరిస్థితుల రీత్యా మేము ఏమి చెప్పలేం అని అన్నారు. అంతేకాక చెప్పడానికి ఏముంది అని అన్నారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రెల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, మూత పడిన విషయం తెలిసిందే. అదే విషయాన్ని గంగూలీ ప్రస్తావించారు. అయితే ప్రజలంతా ఇళ్ళకు పరిమితం అయ్యారని, కార్యాలయాలు ఇంకా తెరుచుకోలేదు అని వ్యాఖ్యానించారు. అయితే ఇదే పరిస్తితి మే నెల మద్య వరకు ఉంటుంది అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి సమయంలో ఆటగాళ్ళు ఎలా బయటికి వస్తారు అంటూ వ్యాఖ్యానించారు. ఇలా అడగడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసలు ఐపీఎల్ నీ పక్కనపెట్టి, కొంచెం ఇంకిత జ్ఞానం తో ఆలోచిస్తే, క్రీడలు నిర్వహించే పరిస్థితులు ఇపుడు ఎక్కడ ఉన్నాయి, ఐపీఎల్ నీ మర్చిపోండి అని అన్నారు.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పై సౌరవ్ గంగూలీ మీడియా సమావేశం లో చేసిన వ్యాఖ్యలు ఇపుడు హాట్ టాపిక్ అయింది. అంతేకాక మీడియా సమావేశం చివరలో ఐపీఎల్ పై బీసీసీఐ అధికారులతో చర్చించి సోమవారం నాడు అప్డేట్ ఇస్తామని చెప్పారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా జరగాల్సిన చాలా సిరీస్ లు, మాచులు ఆగిపోయాయి. అంతేకాక ఐపీఎల్ కూడా ఆగిపోవడం తో క్రికెట్ అభిమానులు సైతం నిరాశలో ఉన్నారు. అయితే కరోనా వైరస్ నీ పూర్తి స్థాయిలో అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. లాక్ డౌన్ ఉన్న నేపధ్యంలో కేంద్ర మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది.అంతేకాక ఈ లాక్ డౌన్ నీ పొడిగించే అవకాశం కూడా ఉన్నట్లు పలు రకాల వ్యాఖ్యలు వస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈనెల ఆఖరి వరకు లాక్ డౌన్ అమలు చేయాలని తెలిపింది. మరి ప్రధాని సైతం లాక్ డౌన్ కే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.