బిగ్ న్యూస్: ఫ్రీ గా ఫైనల్ కి వెళ్లడం కంటే…సౌత్ ఆఫ్రికా కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు

Friday, March 6th, 2020, 03:15:04 PM IST

ఐసీసీ టీ20 మహిళల ప్రపంచ కప్ ఫైనల్ లోకి భారత్ మొట్టమొదటి సారి అడుగుపెట్టింది. అయితే వర్షం కారణంగా భారత్ ఇంగ్లాండ్ ల మధ్య జరగాల్సిన మ్యాచ్ ఆగిపోవడం తో అత్యధిక రన్ రేట్ కారణంగా భారత్ ఫైనల్ లో అడుగు పెట్టింది. అయితే రెండో సెమి ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా తో తలపడిన సౌత్ ఆఫ్రికా జట్టు ప్రపంచ కప్ నుండి నిష్క్రమించింది. అయితే ఈ సౌత్ ఆఫ్రికా టీం కెప్టెన్ డెన్ వాన్ నీకెర్క్ ఓటమి అనంతరం టీం ఇండియా ని ఉద్దేశించి పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేసింది.

అయితే నీకెర్క్ మాట్లాడుతూ, ఫ్రీ గా ఫైనల్ చేరడం కంటే సెమిస్ లో ఓడిపోవడం బెటర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే తాము ఫైనల్ కి వెళ్లాలనే ప్రయత్నం తో ఆడాము కానీ, వర్షం వల్ల ఆగిపోతే అత్యధిక విజయాలతో ఫైనల్స్ కు వెళతామనే ఆలోచన లేదు అంటూ తన అసహనాన్ని వెళ్లబుచ్చింది. అయితే నీకెర్క్ చేసిన వ్యాఖ్యలకు గానూ టీం ఇండియా కామెంటేటర్ హర్షాభోగ్లే స్పందించారు. నీకెర్క్ కు సమాధానం ఇచ్చారు. అయితే తాము ఫ్రీ గా వెళ్ళామా? మ్యాచ్ ఆడి వెళ్ళామా? అన్నది మన చేతిలో లేదని, కానీ ఎవరూ ఫైనల్ కు ఫ్రీ గా వెళ్ళరు అని, గ్రూప్ స్టేజి లో టీం ఇండియా బాగా ఆడిన కారణంగానే ఫైనల్ లో ప్రవేశించింది అని ఘాటుగా జవాబిచ్చారు.