సచిన్ అభిప్రాయం తో 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ పై విచారణ జరపాలి!

Monday, June 22nd, 2020, 11:38:27 AM IST

గత కొద్ది రోజులుగా 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ పై పలు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. శ్రీలంక దేశానికి చెందిన గత క్రీడా మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ అయింది అని పలు సంచలన విమర్శలు చేశారు. అయితే ఈ వ్యవహారం పై అరవింద దిసిల్వ స్పందించారు. ఈ ఆరోపణల పై అనుమానాలు తొలగిపోవాలంటే ఐసీసీ, బీసీసీఐ, ఎస్ ఎల్ సి క్రికెట్ బోర్డు లు విచారణ జరిపి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి అని వ్యాఖ్యానించారు.

సచిన్ టెండూల్కర్ ఎన్నో ఏళ్ళు వేచి చూసిన విజయం అది అని, ఆ విజయానికి నిజమైన అర్హుడు అని, ఆ మ్యాచ్ గెలిచినప్పుడు మేము కూడా ఆస్వాదించాం అని అన్నారు. సచిన్ లాంటి గొప్ప ఆటగాళ్లకు ఆ మ్యాచ్ జీవితాంతం గుర్తుండి పోయే చిరస్మరనీయ విజయం అని వ్యాఖ్యానించారు. అందుకోసమే సచిన్ తో పాటుగా కోట్లాది అభిమానుల ఇష్ట ప్రకారం ఆ ఫైనల్ మ్యాచ్ పై విచారణ జరపాలి అని అన్నారు.

అయితే ఈ విషయం పై పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాళ్ళు నిజంగా గెలిచారా లేకపోతే ఫిక్సింగ్ చేసి గెలిచారా అని ప్రజలకు తెలియజేయాలి అను అన్నారు.ఇలాంటి ఆరోపణలు వచ్చినపుడు ప్రతి ఒక్కరూ పై ఇవి ప్రభావం చూపుతాయి అని,భారత జట్టు పై కూడా ప్రభావం చూపుతుంది అని వ్యాఖ్యానించారు. మనమెంతో ఇష్టపడే క్రికెట్ కోసం అయినా దీని పై విచారణ జరపాలి అని అన్నారు. అయితే క్రీడా మంత్రి చేసిన వ్యాఖ్యలను అరవింద దిసల్వ ఖండించారు.