ఆ జట్టు వరల్డ్ కప్ గెలిస్తే చూడాలనివుంది..గూగుల్‌ సీఈవో

Friday, June 14th, 2019, 12:39:10 AM IST

ఇంగ్లాండ్ లో జరుగుతున్నా వరల్డ్ కప్ గురించి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. ఇక క్రికెట్ ప్రేమికులు అయితే జట్టుతో సంబంధం లేకుండా ప్రతి మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ అన్ని జట్లు కంటే వరుణదేవుడే ఎక్కువ మ్యాచ్లు ఆడుతున్నాడు అనుకో, ఇక అసలు విషయానికి వస్తే గూగుల్ సీఈవో సుందర్‌ పిచాయ్‌ మాట్లాడుతూ నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అమెరికా వచ్చిన కొత్తలో నాకు బేస్ బాల్ అంటే బాగా ఇష్టం ఉండేది, కానీ అది కొంచెం కఠినమైన గేమ్ అని అర్ధం అయ్యి, క్రికెట్ కి షిఫ్ట్ అయ్యిపోయాను.

అప్పటి నుండి వీలుచిక్కినప్పుడు క్రికెట్ ఆడటానికి వెళ్తుంటాను. ప్రస్తుతం జరుగుతున్నా వరల్డ్ కప్ ని ఫాలో అవుతున్న, నాకు తెలిసి ఇండియా – ఇంగ్లాండ్ ఫైనల్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నా వరకు అయితే “మెన్‌ ఇన్‌ బ్లూ” వరల్డ్ కప్ గెలవాలని కోరుకుంటున్న, అయితే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ జట్లు కూడా చాలా బాగా ఆడుతున్నాయి. వాటికీ కూడా అవకాశాలు లేకపోలేదు. బహుశా సెమీ ఫైనల్స్ లో ఈ పైన చెప్పిన నాలుగు జట్లు రావచ్చని అనిపిస్తుంది అంటూ చెప్పకొచ్చాడు..