ఐపీఎల్2020: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే..!

Friday, December 20th, 2019, 08:57:09 PM IST

ఐపీఎల్2020 ఆటగాళ్ళ వేలం నిన్న రాత్రి ముగిసిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో అన్ని ప్రాంచైజీలు కలిపి మొత్తం 62 మంది ఆటగాళ్ళను కొనుగోలు చేశాయి. అయితే ఆరెంజ్ ఆర్మీ సన్ రైజర్స్ యాజమాన్యం కొత్తగా ఏడుగురు ఆటగాళ్ళను టీమ్ లోకి తీసుకుంది. అయితే ఈ ఏడు మంది ఆటగాళ్ళలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్, విండీస్ ఆల్ రౌండర్ ఫాబియన్ అలెన్ వంటి ముఖ్య ఆటగాళ్ళు ఉన్నారు.

అయితే భారత అండర్-19 జట్టు కెప్టెన్ ప్రియామ్ గార్గ్, విరాట్ సింగ్‌లను కూడా దక్కించుకుంది. సంజయ్ యాదవ్, అబ్దుల్ సమద్, భావనక సందీప్ వంటి యివ ప్లేయర్లను కూడా జట్టులోకి తీసుకుంది. అయితే బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌పై ఐసీసీ నిషేదం కారణంగా అతడిని వదులుకున్న సన్‌రైజర్స్ యూసుఫ్ పఠాన్‌, దీపక్ హుడా, మార్టిన్ గుప్టిల్, రికీ భూయ్‌ని కూడా వదులుకుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు-2020: డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, మిచెల్ మార్ష్, విజయ్ శంకర్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సంజయ్ యాదవ్, ఫాబియన్ అలెన్, విరాట్ సింగ్, ప్రియామ్ గార్గ్‌, భావనక సందీప్ , సిద్ధార్థ్ కౌల్, బిల్లీ స్టాన్లేక్, అబ్దుల్ సమద్, వృద్దిమాన్ సాహా, జానీ బెయిర్‌స్టో, షాబాజ్ నదీమ్, శ్రీవాత్సవ్ గోస్వామి, అభిషేక్ శర్మ, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, టి నటరాజన్