క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఆల్ రౌండర్ యూసఫ్ పఠాన్..!

Saturday, February 27th, 2021, 12:31:22 AM IST


టీమిండియా ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్ ఇంటర్నేష్నల్ క్రికెట్‌తో సహా అన్ని ఫార్మట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ క్రమంలోనే ట్విట్టర్ ద్వారా ఉద్వేగభరితమైన సందేశాన్నిచ్చాడు. రిటైర్మెంట్‌ అనే పదం వినడానికి బాధగా ఉందని, ప్రతి ఒక్కరు ఏదో ఒక దశలో తమ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాల్సిందేనని, నా రిటైర్మెంట్‌కు ఇదే కరెక్ట్ టైం అని భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు. తనకు ఇన్నాళ్లుగా ఎంతో మద్దతునిచ్చిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నట్టు యూసఫ్ పఠాన్ తెలిపాడు.

అయితే ఇదిలా ఉంటే యూసుఫ్ పఠాన్ తన కెరీర్లో టీమిండియా తరపున 57 వన్డేలు, 22 టీ20లు ఆడాడు. చివరిగా 2012లో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడాడు. ఆ తర్వాత ఫాం కోల్పోవడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. టీమిండియా సాధించిన 2007 టీ20 ప్రపంచ కప్‌లో, 2011 ప్రపంచకప్‌లో ఆడాడు. ఇక ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌, కేకేఆర్‌, పుణే వారియర్స్‌, సన్‌రైజర్స్‌ తరపున కూడా ఆడాడు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన అతను పఠాన్‌ క్రికెట్‌ అకాడమీని ప్రారంభించాడు.