T-20 వరల్డ్ కప్: బంగ్లాను చిత్తు చేసిన టీమిండియా అమ్మాయిలు..!

Monday, February 24th, 2020, 09:04:18 PM IST

టీ-20 మహిళా ప్రపంచ కప్‌లో భాగంగా టీమిండియా, బంగ్లాదేశ్‌ల మధ్య ఆస్ట్రేలియాలోని పెర్త్ వేదికగా నేడు జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేయగలిగింది. అయితే భారత ఓపెనర్ షెఫాలీ వర్మ 39 పరుగులు, జెమిమా రోడ్రిగ్స్‌ 34 పరుగులు చేయగా, బంగ్లా బౌలర్లలో సల్మ 2 వికెట్లు, పన్నా ఘోశ్‌ 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 124 పరుగులను మాత్రమే చేయగలిగింది. బంగ్లా బ్యాటర్లలో నిగర్‌ సుల్తానా 35 పరుగులు, ముర్షిదా 30 పరుగులు పోరాడినా బంగ్లా విజయాన్ని అందుకోలేకపోయింది. టీమిండియా బౌలర్లు పూనమ్‌ 18 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా, అరుంధతి 2 వికెట్లు పడగొట్టింది. దీనితో ఈ మ్యాచ్‌లో టీమిండియా 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.