విరాట్ కోహ్లి మరొక రికార్డ్… టాప్ 5 లోకి

Wednesday, March 17th, 2021, 05:40:28 PM IST

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరొక అరుదైన ఘనత సాధించారు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న టీ 20 సిరీస్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండు మ్యాచ్ లలో అర్థ సెంచరీలతో చెలరేగిపోయాడు. అయితే టీ 20 లో రాణించడం తో మరొకసారి టాప్ 5 లోకి అడుగుపెట్టాడు కోహ్లి. ఒక స్థానం మెరుగు పరుచుకుని ఐడవ స్థానం లో నిలిచాడు.అయితే టీమ్ ఇండియా నుండి రాహుల్ ఒక్కడే టాప్ 4 గా ఉండటం గమనార్హం. అయితే టెస్ట్ రాంకింగ్స్ లో కోహ్లి 5 వ స్థానం లో కొనసాగుతుండగా, వన్డే క్రికెట్లో అగ్ర స్థానం లో ఉన్నాడు. అయితే మూడు ఫార్మాట్ లలో టాప్ 5 లో ఉన్న ప్లేయర్ గా కోహ్లి అరుదైన రికార్డు సాధించాడు.