రెండవ టీ20 లో ప్రపంచ రికార్డుల్ని నమోదు చేసిన టీమిండియా

Friday, November 8th, 2019, 12:34:22 PM IST

బాంగ్లాదేశ్ తో జరిగిన రెండవ టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయాన్ని సాధించింది. ఎనిమిది వికెట్ల తేడాతో విజయాన్ని అందించడమే కాకుండా ప్రపంచ రికార్డుని నెలకొల్పింది టీం ఇండియా. టీ20 ఛేదన లో ఇప్పటివరకు ఆస్ట్రేలియా మొదటిస్థానం లో వుంది. 40 విజయాలతో మొదటి స్తానం లో వున్న ఆస్ట్రేలియా ఇపుడు రెండో స్థానానికి పరిమితమైంది. నిన్న జరిగిన టీ20 విజయం తో భారత్ ఛేదన లో 41 విజయాల్ని నమోదు చేసింది. 61 సార్లు టీ ఇండియా చేజింగ్ కి దిగగా 41 సార్లు గెలుపొందింది. ఆస్ట్రేలియా 69 సార్లు చేజింగ్ లో 40 సార్లు గెలిచింది.

రోహిత్ శర్మ ప్రస్తుతం ఈ టీ20 సిరీస్ లో కెప్టెన్ గా వున్నాడు. దక్షిణాఫ్రికా తో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఎన్ని రికార్డులు నెల కోల్పడో, ఈ టీ20 సిరీస్ లో కూడా అలానే రికార్డుల మీద రికార్డులు నెలకొపుతున్నాడు. అయితే ధోని పేరిట వున్న టీ20 ల్లో అత్యధిక సిక్సర్ల రికార్డుని బద్దలు కొట్టాడు. ధోని 62 ఇన్నింగ్స్ లో 34 సిక్స్ లు కొట్టగా, రోహిత్ 17 ఇన్నింగ్స్ ల లోనే 37 సిక్స్ లు బాదాడు. అంటే కాకుండా అత్యధిక అర్ద శతకాలు కోహ్లీ రికార్డుని సమం చేసాడు. కోహ్లీ 22 అర్ద సెంచరీలతో ముందున్నాడు. ఇంకా ఈ మ్యాచ్ల్లో చాల రికార్డునే నెలకొల్పాడు రోహిత్.