చెలరేగిన భారత్ బౌలర్లు… దక్షిణాఫ్రికా 170/8

Saturday, October 12th, 2019, 02:59:56 PM IST

టీం ఇండియా టెస్టుల్లో తన విజయాల్ని చరిత్రలో లిఖిస్తుంది. దక్షిణఫ్రికా తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా భారీ విజయాన్ని దక్కించుకుంది. రెండో టెస్ట్ మ్యాచ్ ఫలితం కూడా అలాగే ఉండబోతుంది. రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ తన ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. 601 పరుగుల వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసింది. భారీ లక్ష్య సాధనలో దక్షిణాఫ్రికా తడబడింది అని చెప్పాలి. నిన్న మూడు వికెట్లను కోల్పోయిన దక్షిణాఫ్రికా ఈ రోజు 63 ఓవర్లు ముగిసే సరికి 170/8 కి చేరింది.

భారత బౌలర్లు దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ ని మొదటినుండి ఒత్తిడిలోకి నెట్టారు. ప్రస్తుతం ఫిలాండర్, మహారాజ్ బాటింగ్ చేస్తున్నారు. భారీ లక్ష్య సాధనలో దక్షిణాఫ్రికా తడబడటమే కాకా, త్వరితంగా వికెట్లను కోల్పోయింది. భారత్ ముందు అతి భారీ విజయం వుంది, ఈ విజయం తో కోహ్లీ సేన చరిత్రలో నిలవనున్నారు. రెండో ఇన్నింగ్స్ ని మొదలు పెట్టడానికి ఇంకా రెండు వికెట్లని మాత్రమే దక్షిణాఫ్రికా కలిగి వుంది.