టీం ఇండియా కి మరొక ధోని దొరికేసాడు…

Monday, September 2nd, 2019, 05:15:57 PM IST

టీం ఇండియా లో ధోని ఏర్పాటు చేసుకున్న స్తానం ప్రత్యేకమైనది. వికెట్ కీపర్ గా, కెప్టెన్ గా టీం ఇండియా తరపున దేశానికి చాల గౌరవ ప్రదమైన మ్యాచ్ లు ఆడి భారత దేశాన్ని క్రికెట్ లో ప్రధమ స్తానం లో నిలబెట్టాడు. భారతీయుల స్వప్నం ఐన వరల్డ్ కప్ ని తీసుకు వచ్చాడు. ధోని తరువాత స్థానాన్ని భర్తీ చేయాలంటే చాల కష్టమనే చెప్పాలి. కానీ టీం ఇండియా సెలెక్టర్లకి దొరికిన ఒకే వ్యక్తి రిషబ్ పంత్. సెలెక్టర్ల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అద్బుతమైన అట తీరుతో అందరిని ఆకట్టుకుంటున్నాడు. ధోని స్థానాన్ని భర్తీ చేయగలను అని నిరూపించుకుంటున్నారు.

11 వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న పంత్ ధోని రికార్డు కి సంబందించిన ఒక రికార్డుని అధిగమించాడు. టెస్ట్ మ్యాచ్ ల్లో అతి వేగంగా 50 ఔట్లు చేసిన వికెట్ కీపర్ గా పంత్ రికార్డ్ సృష్టించాడు. ధోని ఈ ఫీట్ సాధించడానికి 15 టెస్ట్ మ్యాచులు ఆడగా , పంత్ కేవలం 11 మ్యాచులోనే చేరుకున్నాడు. వెస్టిండీస్ తో జరుగుతున్నా రెండో మ్యాచులో ఈ రికార్డ్ ని సాధించాడు. T20 ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన టీమిండియా వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ తన పేరుని లిఖించున్నాడు. T20 ల్లో మాత్రమే కాకుండా టెస్టుల్లో కూడా తనదైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. ఇదే ఫామ్ కొనసాగిస్తే ఇక టీమిండియా కి మరొక ధోని దొరికినట్లేనని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.