టీ20 ప్రపంచ కప్: మ్యాచ్ ఆడకుండానే ఫైనల్ కు చేరిన భారత్

Thursday, March 5th, 2020, 11:28:10 AM IST

టీం ఇండియా మహిళల జట్టు తొలిసారి టీ20 ప్రపంచ కప్ లో ఫైనల్ కి చేరుకుంది. అయితే సెమిస్ మ్యాచ్ లో గెలుపొందకుండానే ఫైనల్ కి చేరుకుంది భారత్. ఆస్ట్రేలియాలో టీ20 మహిళల ప్రపంచ కప్ లో భాగంగా సెమిస్ లో భారత్ ఇంగ్లాండ్ తలపడాల్సి ఉంది, కాగా వర్షం కారణం గా మ్యాచ్ రద్దయింది. అయితే మొదటి నుండి మెరుగైన రన్ రేట్ తో దూసుకుపోతున్న టీం ఇండియా అధిక రన్ రేట్ కారణం గా ఫైనల్ కు చేరుకుంది. అయితే గత టీ20 ప్రపంచ కప్ లో భారత్ ఇంగ్లాండ్ చేతిలో సెమిస్ లో టీ20 వరల్డ్ కప్ నుండి నిష్క్రమించింది. ఇపుడు అదే ఇంగ్లాండ్ తో మ్యాచ్ రద్దు కారణం గా ఫైనల్ కు చేరింది. అయితే మరొక సెమి ఫైనల్ లో దక్షిణాఫ్రికా మరియు ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ కూడా వర్షం కారణం గా రద్దయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ అదే జరిగితే ఫైనల్ పోరు లో భారత్ తో దక్షిణాఫ్రికా తలపడే అవకాశం ఉన్నది.