చిరాకేసిన ఇంట్లోనే ఉండండం ఉత్తమం.. ఛటేశ్వర్ పుజారా సజేషన్..!

Sunday, April 5th, 2020, 02:00:16 AM IST

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం 21 రోజులు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ సమయంలో చాలా మంది ఇళ్ళకే పరిమితమైన, కొంత మంది మాత్రం ఏదో ఒక సాకుతో యదేచ్చగా రోడ్లపై తిరుగుతూ లాక్‌డౌన్‌ని పాటించడం లేదు.

అయితే దీనిపై భారత టెస్ట్ మ్యాచ్ బ్యాట్స్‌మెన్ ఛటేశ్వర్ పుజారా స్పందిస్తూ లాక్ డౌన్ వేళ‌ ప్రజలకు చిరాకు అనిపించినా ఇళ్ళకే ప‌రిమితం కావాల‌ని అన్నాడు. ఇలాంటి కఠిన సమయంలో అందూ ఇళ్ళలో ఉండడమే మంచిదని, జీవితం కన్నా ఫ్రస్టేషన్‌ గొప్పది కాదని అన్నాడు. ఖాళీ సమయంలో ఇంట్లో కొత్త పనులు చేయాల‌ని తాను అదే చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.