INDvSL 2nd T20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్..!

Tuesday, January 7th, 2020, 06:53:45 PM IST

నూతన సంవత్సరంలో టీమిండియా శ్రీలంక జట్టుతో టీ-20 సిరీస్‌తో పోరుకు సిద్దమయ్యింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. అయితే నేడు ఇండోర్ వేదికగా రెండో టీ20లో భారత్ శ్రీలంకతో తలపడనుంది. అయితే ఇరు జట్లు ఈ ఏడాది విజయంతో మొదలుపెట్టాలని గట్టిగా భావిస్తున్నాయి.

అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ఇరు జట్లు కూడా జట్టులో పెద్దగా మార్పులు ఏమీ చేయలేదు. ఈ సిరీస్‌లో రోహిత్‌కి విశ్రాంతి ఇచ్చిన టీమిండియా రోహిత్ స్థానంలో శిఖర్ ధావన్‌ను ఓపెనర్‌గా పంపనుంది. ఇక షమీ స్థానంలో బుమ్రాను తిరిగి జట్టులోకి తీసుకోగా, జడేజా స్థానంలో సందీప్ షైనీకి అవకాశం కల్పించారు. ఇక శ్రీలంక జట్టులో మొదటి టీ-20లో మ్యాథ్యూస్‌కి విశ్రాంతి ఇచ్చినా శ్రీలంక ఈ మ్యాచ్‌లో కూడా అతడిని జట్టులోకి తీసుకోలేదు.

భారత జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్‌), శిఖర్ ధావన్, కేఎల్. రాహుల్, శ్రేయస్స్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్‌ యాదవ్ ,సందీప్ షైనీ, శార్దుల్, బుమ్రా

శ్రీలంక జట్టు: లసిత్ మలింగ (కెప్టెన్‌), గుణతిలక, ఒషాడా ఫెర్నాండో, భానుక రాజపక్సా, అవిష్క ఫెర్నాండో, కుషాల్‌ పెరెరా, మాథ్యూస్‌/లహిరు కుమార, షనక, ఉడానా, హసరంగ, కసున్‌ రజిత