చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని నమోదు చేసిన టీం ఇండియా

Sunday, February 2nd, 2020, 06:33:16 PM IST

న్యూజిలాండ్ పర్యటనలో టీం ఇండియా అత్యత్తమ ప్రదర్శన కనబరిచి సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసి చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో 7 పరుగుల తేడాతో భారత్ న్యూజిలాండ్ ఫై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లక్ష్య ఛేదన లో న్యూజిలాండ్ టీం తడబడింది 20 ఓవర్లకు గానూ 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి ఓటమి పాలైంది. బుమ్రా మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా, కేఎల్ రాహుల్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నారు.

మొదట బ్యాటింగ్ దిగిన భారత్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో అత్యధికంగా 60 పరుగులు చేసారు. అయితే 164 పరుగుల లక్ష్యం తో దిగిన న్యూజిలాండ్ ఓపెనింగ్ లోనే వరుస వికెట్లని కోల్పోయింది. సీఫెర్ట్ 30 బంతుల్లో 50 పరుగులు చేసి ఆదుకున్నాడు. ఆ తర్వాత రాస్ టేలర్ 47 బంతుల్లో 53 పరుగులు చేసి జట్టుని కాపాడే ప్రయత్నం చేసారు. ఓవర్లు ముగిసే సమయానికి ఉత్కంఠగా మారింది. కీలక సమయం లో న్యూజిలాండ్ వికెట్లని కోల్పోయింది. భారత్ 5-0 తో క్లీన్ స్వీప్ చేయడం తో క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.